గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్.. హైదరాబాద్లో ఐదు చోట్ల ఉచిత విశ్రాంతి గదులు!
తెలంగాణ : డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి గిగ్ కార్మికులకు ఊరటనిచ్చేలా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), అమెజాన్ ఇండియా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెజాన్ CSR కార్యక్రమంలో భాగంగా కొండాపూర్, తెల్లాపూర్, పటాన్చెరు, భారతీనగర్, చందానగర్ ప్రాంతాల్లో అత్యాధునిక ‘రెస్ట్ స్టాప్ పోర్టా కేబిన్లు’ ఏర్పాటు చేయనున్నారు. వీటిలో గిగ్ వర్కర్లు విశ్రాంతి తీసుకునే సదుపాయంతో పాటు తాగునీరు, ఇతర ప్రాథమిక వసతులు అందుబాటులో ఉంటాయి. ఏ డెలివరీ సంస్థకు చెందిన గిగ్ కార్మికులైనా ఎలాంటి రుసుము లేకుండా ఈ కేంద్రాలను వినియోగించుకోవచ్చు. నిర్మాణం, నిర్వహణ ఖర్చులన్నింటినీ అమెజాన్ ఇండియానే భరిస్తుంది.























