ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలి
-ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు
భీంగల్ మండలం పల్లికొండ గ్రామలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో రోడ్లను మురికి కాలువలను పరిశీలించి పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కోరారు..
అదేవిధంగా జిపి పాలకవర్గం,పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎం ఆశా కార్యకర్త అంగన్వాడి టీచర్ వివోఏ మహిళా సంఘ ప్రతినిధులు కలిసి రెండు మూడు టీములుగా గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్లలో విలువ ఉన్న నీటిని పారబోయించాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
గ్రామ పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అంటు రోగాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు
కార్యక్రమంలో సర్పంచు మనుష ఉపసర్పంచ్లు వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శు వివిధ శాఖల సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు























