EPF లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ పెంపుపై కీలక సిఫార్సు
EPF లబ్ధిదారులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద ప్రస్తుతం అందుతున్న రూ.1,000 కనీస పెన్షన్ సరిపోవడం లేదని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ను గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని కేంద్ర కార్మిక శాఖకు సిఫార్సు చేసింది. పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.7,500కి పెంచాలని లబ్ధిదారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

























