Homeత్రిశూల్ న్యూస్బాల్కొండ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోలీస్ కమీషనర్

బాల్కొండ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోలీస్ కమీషనర్

నేడు బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ని జమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  నిజామాబాద్ పోలీస్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్., ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కమిటీ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాదుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ  జాన్ రెడ్డి , బాల్కొండ ఎస్సై శైలంధర్, మైనారిటీ ప్రెసిడెంట్  మజారుద్దీన్ , వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రియాజుద్దీన్ , సెక్రెటరీ  ఎండి అక్బర్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సీపీ హాజరుకావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

లంపి చర్మ వ్యాధిని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ఇంట్లో మేకపాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది

0
ప్రాతినిధ్య ప్రయోజనం కోసం చిత్రం పూణే: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్ ప్రొడక్ట్స్ (IVBP) ఇటీవలి సంవత్సరాలలో మహారాష్ట్ర అంతటా వేలాది జంతువులను చంపిన ముద్ద...

Translate »
error: Content is protected !!