ధర్పల్లి లో సితాయిపేట్ వెళ్లే రోడ్ పనులు ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం లో సితాయిపేట్ గ్రామం వెళ్లే ప్రధాన రోడ్డు పనులను ప్రారంభంచిన డిసిసి ఉప అధ్యక్షులు ఆర్మూర్ బాలరాజ్ గారు. ఆర్మూర్ బాలరాజు గారు మాట్లాడుతూ ఈ ప్రధాన రోడ్డు ను అనుకొని ఉన్నటువంటి సీతాయిపేట్,హోన్నాజీపేట్, గడ్కోల్ మరియు మరికొన్ని తండాల కు అత్యవసరంగా వెళ్లడానికి ప్రధాన మార్గం ఇదే అయినందున ఈరోజు మరమ్మత్తులు చేసి రాకపోకలు జరిగేలా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో ధర్పల్లి గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ గారు, వార్డు సభ్యులు నిమ్మల వినయ్ గౌడ్ గారు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు























