ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఆసుపత్రిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైద్య, వైద్యేతర సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నిహారిక, డాక్టర్ నికిత రెడ్డి, డాక్టర్ అజయ్ రెడ్డి, హెడ్ నర్సులు జరీనా, రత్నకుమారి, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

























