ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో లక్ష్మారెడ్డి
సోమవారం : 13/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ పరిధిలోని ధర్పల్లి మండలం సల్పబండ తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఎంపీడీవో లక్ష్మారెడ్డి పరిశీలించారు. కూలీల హాజరు వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.























