ధర్పల్లి నర్సరీ మొక్కలను పరిశీలించిన ఎంపీడీవో
సోమవారం : 13/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం స్వల్ప బండ తండా, సితాయిపేట్, కొట్టాలపల్లి గ్రామాల్లోని నర్సరీలను ఎంపీడీవో లక్ష్మారెడ్డి పరిశీలించారు. వేసవి సమీపిస్తున్నందున మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా నీరు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వినోద, ఈసీ వినోద తదితరులు పాల్గొన్నారు.

























