నూతన ఇన్స్టంట్ గురు బ్రాంచ్ ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి పట్టణంలో 49 వార్డులో ఓల్డ్ బస్టాండ్ జనని హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన “ఇన్స్టంట్ గురు”డెలివరీ బ్రాంచ్‌ను టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన మరియు సురక్షితమైన డెలివరీ సేవలు అందించడం ఎంతో అవసరమని అన్నారు. “ఇన్స్టంట్ గురు” ద్వారా వినియోగదారులకు Fast Delivery, Best Price, Wide Range, Safe Service అందిస్తూ, స్థానిక ప్రజలకు మెరుగైన డెలివరీ సేవలను అందించాలని ఆకాంక్షించారు.
“Your Local Delivery Partner” అనే లక్ష్యంతో ఇన్స్టంట్ గురు ముందుకు సాగడం అభినందనీయమని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నూతనంగా ప్రారంభమైన ఈ బ్రాంచ్ విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్, సునీల్ గౌడ్, పండు శ్రీకాంత్,సంస్థ నిర్వాహకులు, పుల్లూరి జ్యోతి,సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























