తెలంగాణలో పునర్విభజనతో కొత్త స్థానాలు.. రిజర్వేషన్లు ఇవే ఈ సీట్ల కుదింపు…
_తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా డీ లిమిటేషన్ అమలుకు సిద్దమైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం దిశగా కసరత్తు చేస్తోంది._
_తెలంగాణ సీఎం రేవంత్ నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నారు. కాగా, కేంద్రం ఇప్పటికే 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజనకు సిద్దమైంది. దీంతో.. కొత్తగా వచ్చే ఎంపీ స్థానాలు.. రిజర్వేషన్ల పైన దాదాపు స్పష్టత వచ్చింది._
_కేంద్రం 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసే విధంగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2029 లోనే ఈ కొత్త నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన డీలిమేటషన్ తో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 26కి చేరనుంది. కాగా.. 2011 జనాభా లెక్కల మేరకు నియోజకవర్గాల పెంపు జరగనుండటంతో.. కొత్త నియోజకవర్గాల పైన స్పష్టత వచ్చింది. ఈ లెక్క ప్రకారం రంగారెడ్డి ఉమ్మడి జిల్లా 52,96,741 జనాభాతో రాష్ట్రంలో మొదటిస్థానంలో.. ప్రస్తుతం మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలు పరిధిలో విస్తరించి ఉంది. వీటి పరిధులన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. అదే విధంగా రాష్ట్రంలో హైదరాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో జనాభా అధికంగా ఉన్నారు. కాగా, దీనిని దృష్టిలో ఉంచుకుని వీటిని విభజించి కొత్తగా నాలుగు లోక్ సభ స్థానాలుగా పెంచే అవకాశం కనిపిస్తోంది. మల్కాజ్ గిరి దేశంలోనే అధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావటంతో ఇది రెండు స్థానాలుగా మారనుంది._
*_డీలిమిటేషన్ తో మారనున్న రాజకీయ ముఖచిత్రం_*
_ఇక, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు వేరుచేసి కొత్తగా మరో రెండు స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా మరొక స్థానం ఏర్పాటు కానుంది. ఇక, మహబూబ్ నగర్ – నాగర్ కర్నూలు ను విభజించి మరో స్థానం ఏర్పాటు చేసే విధం గా కసరత్తు జరుగుతోంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల పరిధిలో మరో రెండు స్థానాలు రానున్నాయి. ఇక.. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొండనుండటంతో.. రాష్ట్రంలో మహిళల కు 2029 ఎన్నికల నుంచి 9 స్థానాలు కేటాయించనున్నారు. అదే విధంగా అసెంబ్లీ స్థానాల్లోనూ మహిళలకు 55 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తరువాత కేంద్రం డీ లిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయనుంది. అభిప్రాయ సేకరణ తరువాత.. కేంద్రానికి ఇచ్చే నివేదిక.. ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాత ఈ కొత్త నియోజకవర్గాల పైన అధికారికంగా గెజిట్ విడుదల కానుంది. దీంతో.. ఈ డీలిమిటేషన్ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది._

























