భీంగల్‌లో డివైడర్ సెంటర్ లైటింగ్‌కు నూతన విద్యుత్ బల్బుల ఏర్పాటు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: భీంగల్ పట్టణంలోని ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్‌లో చెడిపోయిన విద్యుత్ బల్బుల స్థానంలో నూతన విద్యుత్ బల్బులను ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయంతో లైట్లను ఏర్పాటు చేసే పనులను మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్, ప్రజా ప్రతినిధులు నర్సయ్య తదితరులు పరిశీలించారు.
పట్టణంలోని డివైడర్ మధ్యలో చెడిపోయిన లైటింగ్‌ను గుర్తించి, ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించేందుకు నూతన లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ సుందరీకరణతో పాటు రహదారులపై వెలుతురు మెరుగుపరచడంపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

























