Homeతెలంగాణ99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు...

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్ వెల్లడి ఎడపల్లి గ్రామ ప్రజలకు/ డ్రైవర్స్ కు అవగాహన కార్యక్రమం

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్ వెల్లడి

ఎడపల్లి గ్రామ ప్రజలకు/ డ్రైవర్స్ కు అవగాహన కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం , ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నేడు 6వ రోజు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు సంబంధించినటువంటి ఎస్సైలు, సీ.ఐ లు, ఏ.సీ.పీ లు మరియు నిజామాబాద్ జిల్లా అదనపు డి.సి.పి (అడ్మిన్) మరియు పోలీస్ కమిషనర్  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగముగా నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద ప్రజలతో మరియు డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం లో * నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం , మద్యం సేవించి వాహనం నడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం , ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలియజేసారు. కోవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025 లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని తెలియజేశారు. కావున రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి మరణాలు జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని ఇట్టి కృషి అనేది ప్రతి ఒక్కరీ,నుండి మొదలవ్వాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో అట్టి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తారో , అతనికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించుట కోసం సహార్విర్ పథకం కింద ఉండేటటువంటి 25 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు మరియు పోస్టర్లను విడుదల చేసారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీ.ఐ  విజయబాబు, ఎడపల్లి ఎస్సై  రామ, బోధన్ రూరల్ ఎస్సై  మచ్చేందర్ రెడ్డి , రెంజల్ ఎస్సై  చంద్రమోహన్ , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రజలు/ఆర్టీసీ డ్రైవర్లు/ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

0
చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన! హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీలు కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు ప్రేమతో చెప్పిన భద్రతా మాటకు వాహనదారుల నుంచి సానుకూల స్పందన జరిమానాల కంటే అవగాహనతోనే మార్పు  సాధ్యమని పోలీసుల...

ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ...

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

Translate »
error: Content is protected !!