Homeత్రిశూల్ న్యూస్నిజామాబాదు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహణ యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు...

నిజామాబాదు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహణ యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది : పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాదు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహణ

యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది : పోలీస్ కమీషనర్ వెల్లడి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

Say no to drugs , yes to life అనే నినాదం తో యువత ముందుకు వెళ్ళాలి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ చౌరస్తా వద్ద ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *నిజామాబాదు పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* హాజరై జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యువత సన్మార్గంలో నడవాలి చెడు అలవాట్లకు దూరముగా ఉండాలి , డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అనే సందేశం ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ “యువతే దేశానికి భవిష్యత్తు. మీలో ఉన్న శక్తి , సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే మీరు మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రీడలు, వ్యాయామం చాలా అవసరం. అలాంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యంత అవసరం. ఒకసారి ఆ అలవాట్లలో పడితే బయటపడటం చాలా కష్టం. కాబట్టి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి మార్గాన్ని ఎంచుకోండి. మరియు మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది కావున యువకులు మరియు విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై డ్రగ్స్ బారిన పడకూడదని సూచించడం జరిగింది. ఈ సమాజంలో ఎవరైనా డ్రగ్స్ గాని గంజాయి గాని అమ్మిన మరియు సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 1908 నెంబర్ లేదా 100 కు కాల్ చేయాలని సూచించడం జరిగింది. డ్రగ్ ఫ్రీ సొసైటీగా తీసుకురావాలని మరియు దీనికి ప్రజల సహకారం యువత సహకారం మీడియా సహకారం ఉండాలని కోరడం జరిగింది. ప్రతీ ఒక్కరితో Say no to drugs, Yes to life అని సూచించడం జరిగింది. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలు వినండి. సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. మీరు సన్మార్గంలో నడిస్తే మీ కుటుంబానికి, సమాజానికి గర్వకారణం అవుతారు.ఈ 2K రన్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచడం మాత్రమే కాకుండా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒక బలమైన సందేశాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ అందిస్తున్నదని , అందరూ ఈ సందేశాన్ని జీవితంలో ఆచరించాలి.” ఇలాంటి సందేశం ద్వారా యువతలో సానుకూల మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు డాన్సులు మరియు నాటకాల రూపంలో గంజాయి యొక్క పర్యావసనాలని ప్రజలకు చూపించడం జరిగింది. తర్వాత 2కే రన్ ని పోలీస్ కమీషనర్  జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.ఈ 2 కె రన్ బై పాస్ చౌరస్తా నుండి ఐ.డి.ఓ.సి కార్యాలయం వరకు నిర్వహించడం జరిగింది. ఈ 2కె రన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమీషనర్  చేతులమీదుగా వారికి బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్) జి. బస్వా రెడ్డి , నిజామాబాదు ఏసీపీ ప్రకాష్ , ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, నిజామాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎస్సైలు ఎండి షరీఫ్ , ఆనంద్ సాగర్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు గిరిరాజు కాలేజీ , సీఎస్ఐ కాలేజీ , వివేకానంద హై స్కూల్ , ప్రభుత్వ డైట్ కాలేజీ , ఎస్సీ హాస్టల్ , డిఎస్ టెక్నాలజీ మొదలగు కాలేజీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

Translate »
error: Content is protected !!