తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
సోమవారం : 27/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా నాయకుడు గుర్తు చేశారు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు హనుమంత్ రెడ్డి రాజ్‌పాల్ నజీర్ మజీద్ కార్యకర్తలు పాల్గొన్నారు























