మోకాలి శస్త్రచికిత్సకు రూ.1.10 లక్షల LOC మంజూరు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మరపల్లి గ్రామానికి చెందిన బాలేరావు అనసూయకు మోకాలి శస్త్రచికిత్స కోసం రూ.1,10,000 LOC మంజూరు చేయించిన మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మరపల్లి గ్రామానికి చెందిన బాలేరావు అనసూయ మోకాలి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఆర్థిక సహాయం అవసరమవడంతో కుటుంబ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని సంప్రదించారు.
వారి విజ్ఞప్తికి స్పందించిన వేముల ప్రశాంత్ రెడ్డి, బాలేరావు అనసూయ వైద్య చికిత్స కోసం రూ.1,10,000 విలువైన LOC (Letter of Credit) మంజూరు చేయించారు.
ఈ మేరకు వేల్పూర్ లోని ఎమ్మెల్యే నివాసంలో అనసూయ కుమారుడు బాలేరావు వేణు కీ LOC కాపీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా అనసూయ కుటుంబ సభ్యులు తమకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ MPTC మైలారం సుధాకర్, BRS యువజన నాయకుడు బద్దం రాజేష్ పాలొగొన్నారు.

























