ధర్పల్లి: విద్యుత్ సరఫరా చేయాలని రైతుల ఆందోళన
సీతాయిపేట్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో శనివారం రైతులు విద్యుత్ సరఫరా సమస్యపై ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
విద్యుత్ కోతల కారణంగా పంట పొలాలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టిన తమకు విద్యుత్ సమస్యతో తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయానికి అవసరమైన మేరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించి పంటలను కాపాడాలని అధికారులను కోరారు.

























