ఉప్లూర్లో ఈ నెల 17 నుంచి ‘వాలీబాల్ ఛాంపియన్స్ ట్రోఫీ…
మూడు జిల్లాల జట్లకు ఆహ్వానం.. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలను నిర్వహించనున్నారు.
ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సరసం గంగారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో, ఉప్లూర్ వాలీబాల్ అసోసియేషన్, యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో మూడు జిల్లాల నుంచి వివిధ జట్లు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
యువతలో స్నేహభావం, ఐక్యతను పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకొని, మంచి మార్గంలో ముందుకు సాగేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని తెలిపారు.
ఎలాంటి ఎంట్రీ ఫీజ్ లేకుండా విజేతలకు నగదు బహుమతులు
ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందించనున్నారు.
ప్రథమ బహుమతి: రూ.11,111
ద్వితీయ బహుమతి: రూ.6,666
తృతీయ బహుమతి: రూ.3,333
క్రీడాభిమానులు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వాలీబాల్ పోటీలను తిలకించి విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ సభ్యులు సుంకరి విజయ్,వంశీ,మారుతి,మధు,ప్రవీణ్,అక్షయ్,అనిల్,అజయ్,సల్మాన్ కోరారు.

























