బతుకమ్మ సంబరాలకు చెరువు కట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి, అక్టోబర్ 16: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, వీడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
బతుకమ్మ సంబరాల కోసం చెరువు కట్ట వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చే గ్రామ ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించారు.
గ్రామ మహిళలు, ఆడపడుచులు పండుగను ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

























