డిచ్పల్లి మండలం కమలాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
కమలాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో మహిళలు ఘనంగా సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు.

























