పాలెం గ్రామంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!
ఆటపాటలతో.. ఆనందోత్సాహాలతో.. ఘనంగా బతుకమ్మ వేడుకలు!
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్
మోర్తాడ్ మండలం, పాలెం గ్రామంలో ముదిరాజ్ మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సంఘం తరఫున నిర్వహించిన ఈ వేడుకల్లో ముదిరాజ్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, మహిళలందరూ సంప్రదాయ దుస్తుల్లో ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఆనందోత్సాహాలతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పాటలు, ఆటలు, చిరునవ్వులు, మహిళల సందడితో పాలెం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేడుక అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
మహిళల ఐక్యతను చాటుతూ, సంప్రదాయాలను కాపాడుతూ సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు

























