ధర్పల్లిలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం, అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ధర్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రమణ, సబ్ ఇన్‌స్పెక్టర్ జి. సందీప్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రత్యేక అతిథులుగా బి. ప్రవీణ్ రెడ్డి, కొండల సందీప్ రెడ్డి, గజ్జెల అనిల్ కుమార్ పాల్గొననున్నారు. బ్రాంచ్ మేనేజర్ కరుణ సాగర్ దుమాలా ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ధర్పల్లి మండల ప్రజలకు గోల్డ్ లోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ బ్రాంచ్‌ను ప్రారంభించనున్నారు.

























