ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మై ఫీల్డ్ రెస్టారెంట్ ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మై ఫీల్డ్ రెస్టారెంట్‌ను ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య, ఎంపీడీవో అనంతరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతల కిషన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇందల్వాయి సర్పంచ్ గంగామణి, గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఆరెపల్లి దశరథ్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోపి, చింతల దాసు, ఇందల్వాయి విడిసి చైర్మన్ రియాజ్, పాశం కుమార్, డీజే గంగాధర్, దోమకొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

























