ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
హైదరాబాద్ నుంచి ఇంద్రవెల్లి సభకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇంద్రవెల్లిలో నిర్వహించే పంచజన్య సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జి ఆలీం భాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్ కుమార్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు రజాక్ భాయ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ప్రేమ్ నాయక్, జిల్లా మైనారిటీ టౌన్ అధ్యక్షుడు, పార్టీ క్యాడర్, జిల్లా మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

























