ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రిసెప్షన్ సెంటర్ విధులు, వాకీటాకీ (VHF సెట్) వినియోగం, ఆయుధాగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్), లాకప్ నిర్వహణ, బ్లూ కోల్ట్స్ సిబ్బంది విధులు, పెట్రోలింగ్ వాహనం పనితీరు తదితర అంశాలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు.
పోలీస్ శాఖ విధులు, ప్రజలకు అందించే సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి విద్యార్థులకు వివరించినట్లు ఎస్‌ఐ సుమలత తెలిపారు. పోలీసు వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

























