భీంగల్‌లో అనధికార నిర్మాణాలపై ఎన్ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు
నూతన భవన నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు తప్పనిసరి: తహసీల్దార్ కిరణ్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు పొందాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు.
శుక్రవారం భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ఫోర్స్‌మెంట్ టీం సమావేశం నిర్వహించారు. అనంతరం టీం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్మాణంలో ఉన్న అనధికార కట్టడాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఫోర్స్‌మెంట్ టీం హెడ్, తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు నూతన ఇళ్ల నిర్మాణాలు చేపట్టే ముందు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే తెలంగాణ పురపాలక చట్టం–2019 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆర్ అండ్ బీ ఏఈ, ఫైర్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.

























