ఇందల్వాయి పాఠశాలకు రూ.60 లక్షల నిధులు మంజూరు!
మండలంలోని అన్ని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద నిధుల కేటాయింపు.. ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామ ఉన్నత పాఠశాలకు బీజీ-రామ్-జీ ఉపాధి హామీ పథకం కింద రూ.60 లక్షల నిధులు మంజూరు చేయడంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాలకు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించడంపై బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

























