ఇందల్వాయి ప్రజావాణికి అధికారులే కరువు.. ప్రజల సమస్యలు వినేదెవరు?
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు హాజరుకాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీడీవో అనంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకాకపోవడం వల్ల ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని తెలిపారు.
ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు తమ తీరును మార్చుకొని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో అనంతరావు కోరారు. ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.

























