దీపావళి సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 125 కేసుల్లో 649 మంది అరెస్ట్!
రూ.13,07,380 నగదు స్వాధీనం.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహించారు. 2026 నవంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు మూడు డివిజన్ల పరిధిలో మొత్తం 125 కేసులు నమోదు చేసి, 649 మందిని పట్టుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.
ఈ దాడుల్లో మొత్తం రూ.13,07,380 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డివిజన్ల వారీగా వివరాలు:
నిజామాబాద్ డివిజన్:
– నమోదైన కేసులు: 29
– పట్టుబడిన వ్యక్తులు: 175 మంది
– స్వాధీనం చేసుకున్న నగదు: రూ.5,25,370
ఆర్మూర్ డివిజన్:
– నమోదైన కేసులు: 26
– పట్టుబడిన వ్యక్తులు: 131 మంది
– స్వాధీనం చేసుకున్న నగదు: రూ.2,20,760
బోధన్ డివిజన్:
– నమోదైన కేసులు: 70
– పట్టుబడిన వ్యక్తులు: 343 మంది
– స్వాధీనం చేసుకున్న నగదు: రూ.5,61,250
మొత్తం వివరాలు:
– మొత్తం కేసులు: 125
– పట్టుబడిన వ్యక్తులు: 649 మంది
– స్వాధీనం చేసుకున్న నగదు: రూ.13,07,380
దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలతో పాటు కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు.
పేకాట, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

























