Homeతెలంగాణపొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం...

పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం…

పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం

యువతను పొగాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యచరణ

విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: అడిషనల్ కలెక్టర్ భుజంగరావు…

నిజామాబాద్ జిల్లా :   జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని జీవనశైలి వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశ వివరాలను వైద్యాధికారిణి డాక్టర్ అంజన వెల్లడించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ.. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 28న ప్రారంభమైన ‘టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్’లో భాగంగా రెండు నెలల పాటు ఎనిమిది వారాలపాటు నాలుగు దశల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

మొదటి రెండు వారాల్లో సమాచార, విద్యా, ప్రచార కార్యక్రమాల ద్వారా కరపత్రాలు, పోస్టర్లు తదితర మాధ్యమాలతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మూడు, నాలుగు వారాల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, యువతకు పొగాకు వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఐదు, ఆరు వారాల్లో గ్రామాలను పొగాకు రహిత గ్రామాలుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఏడు, ఎనిమిది వారాల్లో విద్యాసంస్థల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టాలని సూచించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని ఎన్ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌కు ఆదేశించారు.

ప్రతి విద్యాసంస్థలో టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రహరీ క్లబ్బులు ఏర్పాటు చేయాలని, గత సమావేశంతో పోలిస్తే తనిఖీల సంఖ్యను 20 శాతం పెంచాలని సూచించారు. విద్యాసంస్థల్లో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ప్రహరీ క్లబ్బుల వివరాలను ప్రదర్శించడంతో పాటు వాటిని పొగాకు రహిత జోన్లుగా ప్రకటించాలన్నారు.

18 ఏళ్లలోపు పిల్లలు పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ ధూమపానానికి అలవాటు పడకుండా అవగాహన కల్పించాలని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో టొబాకో సెల్ ఏర్పాటు చేయాలని, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

జిల్లాలో పొగాకు వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్ల ద్వారా సమాచారం అందించాలని సూచించారు. తదుపరి సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) హాజరయ్యేలా చూడాలన్నారు. పొగాకు సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయి సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ మాట్లాడుతూ.. నికోటిన్‌కు ప్రత్యామ్నాయంగా వైద్యుల సూచన మేరకు ఉపయోగించే మాత్రలు, నమిలే గమ్‌లు, నికోటిన్ ప్యాచ్‌ల ద్వారా ధూమపాన అలవాటును మానుకోవచ్చని తెలిపారు. అవసరమైన వారికి జిల్లా స్థాయి డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నామని వివరించారు.

గత జూన్ నుంచి ఇప్పటివరకు పాఠశాలలు, కళాశాలలు, అనాథాశ్రమాల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ర్యాలీలు చేపట్టినట్లు తెలిపారు. కొన్ని గ్రామాల్లో యువతలో 50 నుంచి 60 శాతం మంది పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులు, ఇతర వ్యక్తులు కూడా నికోటిన్‌కు అలవాటు పడుతున్నారని, వైద్య చికిత్సతో ధూమపాన అలవాటును మానుకోవచ్చని వివరించారు.

బాల్కొండ, ఆర్మూర్, సిరికొండ ప్రాంతాల నుంచి ధూమపానం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన యువత డీ-అడిక్షన్ కేంద్రానికి చికిత్స నిమిత్తం రిఫర్ అవుతున్నారని తెలిపారు.

కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకన్న వివరించారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో రామనారాయణ, ఏఈఓ చక్రపాణి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సవిత, రెడ్‌క్రాస్ సభ్యుడు బస్సు ఆంజనేయులు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నవీన్, పోలీస్ అధికారి ఎస్.ఎం. అలీ, వైద్యాధికారి సుధాకర్, సీఎంఓ శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కమర్ అహ్మద్, డీహెచ్ఈ గన్‌పూర్ వెంకటేశ్వర్లు, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ పి. వెంకటేశం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం…

0
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108...

దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

0
దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం...

గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి…

0
గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా...

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

0
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వ్యాధులపై అవగాహనతోనే ఆరోగ్య సమాజం సాధ్యం: వైఆర్‌జీ కేర్ ప్రతినిధి గర్దాసు సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్కనూరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి...

Translate »
error: Content is protected !!