ప్రతి బుధవారం పేదలకు అన్నదానం
అయ్యప్ప కమిటీ సేవాభావం…
త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం
కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం రోజున పేదవారి కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణ అయ్యప్ప కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
ప్రతి బుధవారం పట్టణంలోని పేదలకు అన్నదానం నిర్వహిస్తూ కమిటీ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
పేదలకు అన్నం పెట్టడం ద్వారా సేవాభావాన్ని చాటుకుంటున్న అయ్యప్ప కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.

























