కే లో ఇండియా టేబుల్ టెన్నిస్ లోగో ఆవిష్కరణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కే లో ఇండియా పోటీల సందర్భంగా జిల్లా కేంద్రంలో వచ్చే నెల 13 నుండి 15 వరకు టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్న సందర్భంగా ఖేలో ఇండియా లోగో,సెల్ఫీ పాయింట్ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ఆర్మూర్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనజ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్వాన్ మాల్వియా నిజామాబాద్ అదనపు కలెక్టర్.కే లో ఇండియా నోడల్ అధికారి.సాయి సురేష్ పాల్గొని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలను నిత్యం సాధన చేస్తే అనుకున్న ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా అనుభవంతో పాటు గెలుపోవటముల విలువలు తెలుస్తాయని ఇది వారి భవిష్యత్తు జీవిత నిర్మాణానికి ఎంతగానో తోడ్పడుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చైనా దేశంలో అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారిణి వర్షిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందని విద్యార్థులు ఇట్టి అవకాశాన్నిఅందిపుచ్చుకొని రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు.గోపి రెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యాపకు బృందం పర్యవేక్షణలో ఈ కార్యక్రమంవిజయవంతంగా నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో మండలవిద్యాధికారి.రవీందర్ ప్రధానోపాధ్యాయులు నరసయ్య పాల్గొన్నారు.























