Homeత్రిశూల్ న్యూస్గ్రామ/వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి

గ్రామ/వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి

గ్రామ/వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు

కలెక్టర్ ఇలా త్రిపాఠీ

నిజామాబాద్, మార్చి 30 :పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 02వ తేదీన గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీలలో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులకు పలు అంశాలపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ముందస్తుగానే గ్రామ/వార్డు సభల వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహించే ప్రదేశాలలో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7.30 నుండి 10.30 గంటల లోపు సభలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభలలో అవగాహన కల్పించడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్దిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా గ్రామ/వార్డు సభల విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఇదిలాఉండగా, పదవ తరగతి పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లకు కలెక్టర్ సూచించారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!