హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ యూనియన్ డైరీ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ
వైద్య ఆరోగ్యశాఖలోని హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ యూనియన్ డైరీ ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ సభ్యులంతా వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని జాతియ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ, మాతా శిశు మరణాల నియంత్రణ, న్యూట్రిషన్, రక్తహీనత, జీవనశైలి వ్యాధులు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, వ్యాధినిరోధక టీకాలు, కీటక జనీత వ్యాధులు, చేతుల శుభ్రత , కుటుంబ నియంత్రణ తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతులు , మహిళా ఆరోగ్యం, మానసిక వ్యాధులు, టీ హబ్, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన, టీబి ముక్తభారత్ అభియాన్, పి సి పి ఎన్ డి టి చట్టం, స్త్రీ పురుష నిష్పత్తి, లింగ సమానత్వము, పాఠశాల ఆరోగ్యం మొదలగు ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృతంగా క్షేత్రస్థాయిలో, పాఠశాలలో, కళాశాలల్లో, అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటేష్, యూనియన్ బాధ్యులు ,DHE లు గన్పూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సలీం, మనోహర్ పాల్గొన్నారు.

























