ధర్పల్లి మండలానికి రూ.1.21 కోట్లు నిధులు
గురువారం : 02/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల మౌలిక సదుపాయాల కోసం తెలంగాణకు విడుదల చేసిన నిధుల్లో ధర్పల్లి మండలంలోని 22 గ్రామాలకు రూ.1.21 కోట్లు నిధులు విడుదలైనట్లు ఎంపీఓ రాజేశ్ బుధవారం తెలిపారు. ఈ నిధులు గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కోసం పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

























