ధర్పల్లి ప్రమాద హెచ్చరిక సూచికను ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది
గురువారం : 02/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో గల ప్రమాదకర మూలమలుపు వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ మలుపు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక గ్రామస్థుడు మహిపాల్ మరియు ఇతరులు పాల్గొన్నారు. ప్రయాణికులు ఈ మలుపు వద్ద వేగం తగ్గించి, జాగ్రత్తగా వెళ్లాలని పోలీస్ శాఖ సూచించింది.

























