ఇందూరు అర్బన్ ఇందూరు నగరంలో హోలీ పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే పాల్గొని ప్రజలతో కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.మొదటగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
“హోలీ పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ ద్వేషాలను దూరం చేసి ప్రేమ, సఖ్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. రంగుల్లా మన జీవితాలు కూడా ఆనందంతో, ఐక్యతతో నిండిపోవాలి” అని అన్నారు.అనంతరం 34వ డివిజన్లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ,“నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులు నిజమైన సేవాధారులు. వారి కృషి వల్లనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. వారి సంక్షేమం కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని తెలిపారు.
తదుపరి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ,“పండుగలు సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర బంధాలను బలపరుస్తాయి. సమాజ అభివృద్ధికి ప్రతి వర్గం సహకారం అవసరం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు,కార్యకర్తలు, సంఘ సభ్యులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.























