Homeఇందూరుఅర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి .. కాంగ్రెస్ లో పదవులే ముఖ్యం..ప్రజా సమస్యలు

అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి .. కాంగ్రెస్ లో పదవులే ముఖ్యం..ప్రజా సమస్యలు

అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి ..
కాంగ్రెస్ లో పదవులే ముఖ్యం..ప్రజా సమస్యలు కాదు..
కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్నాయి.. రాష్ట్రం నుంచి సున్నా..
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ…

ఇందూరు: అర్బన్ అభివృద్ధికి నిధులుఇప్పించండి…లేదా రాజీనామా చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. జిల్లాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతుందన్నారు. వైఎస్ఆర్, డీఎస్ మాదిరిగా.. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ జోడీ లక్కీ అంటున్నారు కానీ..కేవలం జేబులు నింపడానికి జోడీ కలిసిందన్నారు. అర్బన్ విషయంలో అనేక సార్లు మంత్రులను, అధికారులను కలిసి వినతులు అందించినా..లాభం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ పెద్దలు జిల్లాలో అనేక మంది ఉన్నా..నిధులు తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కు వోఆర్ఆర్ మంజూరు చేశారు కానీ నిజామాబాద్ పై చిన్నచూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి ఓఆర్ఆర్ తీసుకొస్తానంటూ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్దే.. పిసిసి ప్రెసిడెంట్ జిల్లా వాసి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు, చైర్మన్లు ఉన్నారు..రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన వ్యక్తే అయినా … నగరానికి రింగురోడ్డు తేలేకపోయారని విమర్శించారు. సీఎం వైయస్సార్ సమయంలోనే జిల్లాకు 52 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఏళ్లు గడుస్తున్న పూర్తి కావడం లేదు అన్నారు. కేవలం 11 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును 12 ఏళ్లుగా పూర్తి చేయకుండా నత్తనడకన నడిపిస్తున్నారని విమర్శించారు. అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కు ఆయా అభివృద్ధి పనుల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 5,620 కోట్లు నిధులు వచ్చాయన్నారు. కానీ నిజామాబాద్ కు మాత్రం విస్మరించారన్నారు.

నిజామాబాద్ అర్బన్ లో 30 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అటకెక్కిందని, క్రీడా స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మాధవ నగర్ బ్రిడ్జి, అర్సపల్లి బ్రిడ్జి స్థల సేకరణ అసంపూర్తిగా మిగిలిపోయాయని చెప్పారు. కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని తెలిపారు. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తామని చెప్పిఇప్పటి వరకు ఉలుకూ పలుకు లేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు నిండుగా వస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే బిజెపి పోరాటం ఉదృతం చేస్తుందన్నారు. వచ్చే వారంలో సీఎంని కలుస్తానని, స్పందించకపోతే తమ సత్తా చాటుతామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు న్యాలం సునీత రాజు, మఠం పవన్, చింతకాయల రాజేందర్, కల్పే చిరంజీవి, జగదీష్ కులకర్ణి, పసునూరి రాము మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, భూపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

Translate »
error: Content is protected !!