Homeత్రిశూల్ న్యూస్ఇసుక అక్రమ రవాణా నిరోధానికి సాలూర వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు ...

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి సాలూర వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన టీ.జి.ఎం.డీ.సీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా

నిజామాబాద్, మార్చి 07 : పొరుగు రాష్ట్రాల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని సాలూర వద్ద టీ.జీ.ఎం.డీ.సీ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ను నెలకొల్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా చెక్ పోస్ట్ ను శనివారం లాంచనంగా ప్రారంభోత్సవం చేశారు.ఈ చెక్ పోస్ట్ వద్ద వేయింగ్ మెషిన్ తో ఇసుక వాహనాల తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా అక్రమ ఇసుక రవాణాతో పాటు, ఓవర్ లోడింగ్ ను సైతం నిరోధించేందుకు ఆస్కారం కలిగిందని ఎం.డీ భవేష్ మిశ్రా ఈ సందర్భంగా వెల్లడించారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుని మహారాష్ట్ర నుండి నిర్ణీత పరిమాణంలో నిబంధనలకు అనుగుణంగా ఇసుకను తరలించవచ్చని, అయితే సాలూర చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇదివరకు చెక్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇసుక రవాణా విషయంలో పలు అక్రమాలు జరిగేవని, ఈసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూర వద్ద జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుందని తెలిపారు. అంతేకాకుండా ఓవర్ లోడ్ సమస్యను నిరోధించడం ద్వారా రోడ్లు చెడిపోకుండా, రోడ్డు ప్రమాద సంఘటనలు జరుగకుండా నిలువరించవచ్చని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ కు సమీపంలోనే మహారాష్ట్ర ఇసుక క్వారీలు ఉన్నందున ఇసుక అవసరమైన వారికి తక్కువ ధరకే ఇసుక లభ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంజీరాలో ఇసుక తవ్వకాలకు సంబంధించి సరిహద్దు సమస్య తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ భూభాగాన్ని గుర్తిస్తూ స్పష్టంగా సరిహద్దులు ఏర్పాటు చేశామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని, ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు. ఇసుక తవ్వకం, రవాణాలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటికే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎం.డీ భవేష్ మిశ్రా గుర్తు చేశారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చెక్ పోస్ట్ నిర్వహణ సజావుగా జరగాలని, గట్టి నిఘాను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏ.డీ సంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏ.డీ అశోక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

Translate »
error: Content is protected !!