Homeత్రిశూల్ న్యూస్అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కలెక్టర్ ఇలా త్రిపాఠి 2 కే...

అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కలెక్టర్ ఇలా త్రిపాఠి 2 కే రన్ లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే, మేయర్

నిజామాబాద్, మార్చి 07 : అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2 కే రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన ఈ పరుగును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రధాన మార్గాల మీదుగా పాత ఆర్డీఓ కార్యాలయం వరకు 2 కే రన్ కొనసాగింది.   ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకిత భావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరేలా సమర్ధవంతంగా కార్యక్రమాలు అమలు చేయాలని, అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది నిజామాబాద్మున్సిపల్ కార్పొరేషన్ కు మంచి పేరు తేవాలన్నారు. వైద్య శాఖతో సమన్వయం చేసుకుని మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా, 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నిరోధం కోసం హెచ్.పీ.వీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కారం అయ్యేలా తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు.  అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అమలు చేస్తూ నగర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రగతి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమమని, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి చక్కటి పేరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

Translate »
error: Content is protected !!