Homeతెలంగాణరాష్ట్రంలో ఎల్ పీ జీ గ్యాస్ కొరత లేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో ఎల్ పీ జీ గ్యాస్ కొరత లేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నిజామాబాద్, మార్చి 13: రాష్ట్రంలో ఎల్‌పి.జి గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు అపోహలకు గురికాకూడదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ, అమెరికా – ఇరాన్ యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న గ్యాస్ కొరత ప్రచారం పూర్తిగా అవాస్తవం అని అన్నారు.

రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 810 ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుండగా, మొత్తం కోటి 29 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఉన్నాయని, రోజుకు సగటున 2.5 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే అపోహల కారణంగా ప్రస్తుతం బుకింగ్స్ 72 శాతం వరకు పెరిగినట్లు పేర్కొన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుందని మంత్రి తెలిపారు.  అపోహలను ఆసరాగా చేసుకుని గ్యాస్ నిల్వ చేయడం, మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాల వారీగా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి మాత్రమే ఎల్‌పిజి బుకింగ్ చేయాలని వినియోగదారులకు సూచించారు. అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయకుండా అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీవెన్ రవీంద్ర పాల్గొనగా, నిజామాబాద్ కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, అరవింద్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.....

0
అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు... ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా... కన్నులపండుగగా శోభాయాత్ర... ఇందూరు: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్...

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

0
స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ఇందూరు: జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన...

జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ ..జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే...

0
జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ .. జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే క్షవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

Translate »
error: Content is protected !!