Homeజక్రాన్‌పల్లి మండల్జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు

అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు…

 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి మినీ సబ్‌జూనియర్ (అండర్‌–13) సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన పెండ్యాల సహస్ర, గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు.

అక్టోబర్ 11, 12 తేదీల్లో తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల అంతర్‌జిల్లా పోటీల్లో పెండ్యాల సహస్ర ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా అక్టోబర్ 16, 17 తేదీల్లో హనుమకొండలోని ఎల్‌బీ కళాశాల మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర అంతర్‌జిల్లా పోటీల్లో గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఈ ముగ్గురు విద్యార్థులు తమ క్రీడా ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. అక్టోబర్ 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని కోపర్‌గావ్‌లో ఉన్న సంజీవని యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి మినీ సబ్‌జూనియర్ (అండర్‌–13) సాఫ్ట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, జిల్లాకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింతమంది ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్ది పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఉపాధ్యాయులు, స్థానికులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

0
ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మోయిన్ సాబ్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్ రూరల్...

Translate »
error: Content is protected !!