Homeనిజామాబాద్ జిల్లా వార్తలుఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన కలెక్టర్

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన కలెక్టర్

నిజామాబాద్, ఫిబ్రవరి 23 : ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించగా, ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తన చాంబర్ లో ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గత నెల 23వ తేదీన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి జనవరి 31న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంచనాలతో జరిపించడమే కాకుండా, ఇటీవలే నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా సౌమ్య కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ఎక్సైజ్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి నియామక పత్రం అదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంఘటన జరిగిన నెల రోజుల లోపే సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, సౌమ్య సోదరుడు శ్రవణ్ కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని అన్నారు. బాధిత కుటుంబానికి ఇకముందు కూడా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుగా నిలుస్తుందని కలెక్టర్ భరోసా కల్పించారు. సౌమ్య మరణానికి కారకులైన వారిని కఠినముగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లోఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, సీ.ఐ స్వప్న, ఎస్.ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

Translate »
error: Content is protected !!