Homeనిజామాబాద్ జిల్లా వార్తలుధాన్యం నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్ లు సిద్ధం చేయాలి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి...

ధాన్యం నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్ లు సిద్ధం చేయాలి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టర్ తో కలిసి అధికారులతో సుదీర్ఘ సమీక్ష

నిజామాబాద్, ఫిబ్రవరి 28 : ప్రస్తుత సీజన్ లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్ లను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్ లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి అధికారులతో సుదీర్ఘ నిర్వహించారు. ఒక్కో శాఖ వారిగా అభివృద్ధి పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు.  రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత, లేవీ రూపంలో వారు ఎఫ్ సీ ఐ కి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు, ఇంకా ఎంత లేవీ రావాల్సి ఉంది, ఎన్ని గోడౌన్ లు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాల గురించి సివిల్ సప్లై అధికారులను ఆరా తీశారు. ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ధాన్యం నిల్వ కోసం సరిపడా గిడ్డంగులను అందుబాటులో ఉండేలా ఇప్పటినుండే స్పష్టమైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని అన్నారు. లేవీ అందించడంలో విఫలమైన 57మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుండి రూ. 276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   జిల్లాలో అవసరమైన అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా మెరుగుపరిచే పనులు వేగంగా జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించాలని, క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

Translate »
error: Content is protected !!