150 ఏళ్లనాటి కరవు పరిస్థితులు నెలకొన్నాయి: తుమ్మల…
Jul 27, 2026,,తెలంగాణ : ప్రకృతి తీవ్రత కారణంగా గత 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆయన మాట్లాడుతూ, పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడి, దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ లో కూడా సరైన వర్షాలు కురవవని IMD, ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు























