యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లకు ఘన సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భీంగల్ పట్టణంలో నిర్వహించిన ఊర పండుగకు సంబంధించిన వీడియోలను సృజనాత్మకంగా చక్కటి నైపుణ్యంతో తమ తమ యూట్యూబ్ చానళ్ళలో చిత్రీకరించిన యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లకు గురువారం సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ సంఘ భవనంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీధ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ కంకణాల వంశీకృష్ణ, ద బ్లాక్ రైడర్ శివ, మనోజ్ చింటూ, నిహాల్, సన్నీ షాట్స్, బిటు నిహాల్, నిశాంత్ ఎడిట్స్, మణి ఎడిట్స్, క్రియేటర్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెమోల్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.























