గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ నేరాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి విపులంగా వివరించారు.
అవగాహన సదస్సులోని ముఖ్య అంశాలు:
సైబర్ భద్రత: ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగ ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ (OTP), బ్యాంక్ వివరాలు తెలపవద్దు. ఏవైనా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మత్తు పదార్థాల నిర్మూలన: గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని, యువత వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా లేదా విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
రహదారి భద్రత & సిసి కెమెరాలు: గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరియు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి ఎస్సై, పోలీస్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు శ్రీ. ప్రవీణ్, శ్రీ.గంగాధర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

























