ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF) ద్వారా పేద, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు.
ADF ద్వారా పేద ప్రజల పిల్లలకు అత్యవసర వైద్య సహాయం అందించడంతో పాటు, బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు గృహ నిర్మాణం, వివాహాది శుభకార్యాలు, అనుకోని ఆపద సమయాల్లో ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో భీమ్‌గల్ మండలం పురాణిపేట్ గ్రామానికి చెందిన కొండ గంగాదర్ గౌడ్, ముచ్కూరు గ్రామానికి చెందిన కట్టాజీ శ్రీధర్, చెంగల్ గ్రామానికి చెందిన మోతె సంతోష్ రెడ్డిలకు ADF ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షులు అరే రవీందర్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నిరంతరం సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా అర్వింద్ ధర్మపురి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

























