రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది, సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట అదనపు బస్సులను ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ తరఫున ప్రయాణికులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

























