హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12 మీటర్లు ,2 మీటర్ల లోతు తో ఫార్ము ఫండ్ తో (వ్యవసాయ కుంట ) నిర్మాణానికోరకై సర్పంచ్ శ్రీ నలిమెల గంగా రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ గంగారెడ్డి మాట్లాడుతూ ,,ఎల్నినొ లాంటి ప్రభావం వలన భవిష్యత్తులో ఒకవేళ కరువు పరిస్థితుల్లో మనం అందరం నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ఫార్మ్ ఫండ్ లను తప్పనిసరిగా ప్రతి రైతు తమ పంట భూములలో తయారు చేసుకోవాలని రైతులకు సూచించారు.. ఇవి ఇలా నిర్మించుకోవడం వలన ప్రతి వర్షం నీటి చుక్క మన భూములలో ఇనికి భూగర్భ జలాలు పెంపొందుతాయి.. ఎండాకాలంలో కూడా మన పంటలకు కావలసిన నీరుని అందించవచ్చని, తద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో F A హరీష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల శ్రీకాంత్ ,కాంగ్రెస్ నాయకులు మండ పల్లి మహేందర్, సామ గంగాధర్,ఏలేటి శంకర్ మరియు రైతులు పాల్గొన్నారు.























