రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టడం ఎంతో ఆనందంగా ఉందని గడ్డం ఇందుప్రియ తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గడ్డం ఇందుప్రియకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.

























